Friday, July 27, 2007

అంతు లేని కథ

అంతు లేని కథ..
పేరు చదివి ఇదేదో ఏడుపు కథ అనుకునేరు...ప్చ్.. గ్రహించేసారు..ఇది కొంచం అలాంటిదే...అయితే జయప్రద సినిమా కథ లాంటిది మాత్రం కాదు...ఒక చంటి గాడి అంతులేని ప్రేమ కథల సంకలనం ఈ కథ...
మొదటి భాగం:
చంటి గాడి ఇంటర్మీడియట్ పరిక్షలు అయిపొయాయి...మనోడికి ఇంజినీర్ అవ్వాలని కోరిక...దానికి మరి ప్రవేశ పరిక్ష కూడ పాస్ అవ్వాలిగా...అంటే ఎంసెట్ కి ప్రిపేర్ అవ్వాలి మరి...ఈ పరిక్షకి అందరు రెండు సంవత్సరాలు కష్టపడి చదువుతారు (సుమతులు)....కొంతమంది చదువుదాం లే అనుకుంటూ కాలయాపన చేసి చివరాఖర్లో చదివేసి గట్టెక్కేస్తూ ఉంటారు (కాలమతులు)...మరికొంతమంది చంటి గాడి లాగా చేస్తారు.వీళ్ళె మందమతులు...
ఇంటర్మీడియట్ పరిక్షలు అయ్యాక 20 రోజుల తేడాలొ ఎంసెట్ పరిక్ష ఉంది...అప్పుడు ఏమి చెయ్యాలొ తోచక...ఏదొకటి చెయ్యకపొతే బాగోదు కాబట్టి...దగ్గర్లోని కోచింగ్ సెంటర్ కి వెళ్ళాడు..అప్పటికినానా రకాల కోర్సులు పూర్తయిపొయి 15 రొజుల క్రాష్ కొర్స్ మాత్రమే మిగిలి ఉంది...ఇంకో దారి లేక మనోడు డబ్బు కట్టేసాడు...
మొదటి రోజు రెండు క్లాసులు బానే విన్నాడు...తర్వాత మొదలైంది..'ఏంట్రా ఈ గోల...ఈ పాఠం అసలు మనం ఎప్పుడు విననేలేదు...ఇది అసలు ఇంటర్మీడియట్ లొ ఉందా...ఈ లెక్కఏంట్రా బాబు....చిరాగ్గా ఉందెహె..ఎందుకొచ్చిన గోలరా...రేపటినించి ఎగ్గొట్టితే సరిపొయే అనుకుంటూ దిక్కు తెలియని వాడిలా దిక్కులన్ని చూస్తున్న వాడికి కనిపించింది...సిరి....
కడిగిన ముత్యాన్ని తలపిస్తూ...నవ్వితే ముత్యాలు రాలుతున్నట్టు....మాట వీణ స్వరాన్ని మరిపిస్తూ..ఎంత సేపు చూసినా చూడాలనిపిస్తూ ఉంది...సిరి...
మనోడికి తెగ నచ్చింది...ఇంకే ఓ దిక్కు దొరికింది..
క్లాసులు అయిపొయాక సైకిల్ మీద వెనకాల మెల్లిగా వెళ్ళాడు..ఇల్లు తెలుసుకున్నాడు...ఇక ప్రతి రోజు చుట్టూ తిరిగి, సిరి ఇంటి నుంచి కోచింగ్ సెంటర్ కి బయల్దేరే వేళకి అటు వైపుగా వెళ్ళడం.....క్లాసులొ తనని చూడడానికి ఇబ్బంది లేకుండా ఉండే చోటు వెతుక్కోడం...తను గమనించకుండా తదేకంగా ఆమెనే చూడడం...క్లాసు అయ్యాక మళ్ళీ ఇంటి దాక వెనక వెళ్ళడం..ఇదే పని..అంతే ఇక ఆ రోజు నుంచి ఒక్క క్లాసు కూడ ఎగ్గొట్టకుండా వెళ్ళడం...రోజు తనని చూస్తూ కూర్చోడం...
ఓ రోజు సైకిల్ స్టాండుకి వెళ్ళేప్పడికి సిరి నుంచుని ఉంది...తన సైకిల్ తియ్యడానికి మనోడి సైకిల్ అడ్డుగా ఉంది..దగ్గరగా వెళ్ళి సైకిల్ తీసేసాడు...మాట్లాడాలి అనుకున్నాడు...కానీ నోరు పెగలలేదు...సిరి తన సైకిల్ తీసుకుని కాం గా వెళ్ళిపోయింది...ఛ ఎందుకు మాట్లాడలేదా అనుకున్నాడు..తన పిరికి తనానికి నిందించుకుంటూ ఉండిపోయాడు..
15 రోజులు అయిపొయాయి..ప్రతి రోజు ఆ అమ్మాయిని చూసి వచ్చేయడం తప్పితే ఒక్క సారి కూడా ధైర్యం చేసి మాట్లాడలేదు...ఎన్నో సార్లు ప్రయత్నించాడు...కాని సరిగ్గా సమయం వచ్చేప్పటికి అటుగా ఎవరో రావడం చూసి ఆగిపోవడమో...లేక నోరు పెగలక తిరిగి వచ్చేయడమో తప్పితే..ఏమి చెయ్యలేడు...
ఇక మిగిలిన 5 రోజులు సిరి ఇంటి వైపు తిరిగాడు కాని తను ఒక్కసారి కూడా కనిపించలేదు..ఎంసెట్ పరిక్షలు ముగిసాయి....అందరు పరిక్ష గురించి..ఎన్ని మార్కులు వస్తే ఏ రాంకు వస్తుందొ..ఏ కాలేజి లో సీటు వస్తుందొ..అనిఆలోచిస్తుంటే..మనోడు అవేమీ పట్టక..వీలు చిక్కినప్పుదల్లా సిరి ఇంటి వైపుకు వెళ్ళి కాసేపు ఆ వీధిలో ఛక్కర్లు కొట్టి వస్తూ ఉన్నాడు..పద్దాక తన గురించే అలొచన...నెల తరువాత ఫలితాలు వచాయి...
మిత్రులతో కలిసి మార్నింగ్ షో సినిమాకి వెళ్ళాడు చంటిగాడు..బయటికి వచ్చేప్పటికి కొంత కోలాహలం..అప్పుడు తెలిసింది ఫలితాలు వచ్చినట్టు....వెళ్ళి తన నంబరు చూసుకున్నాడు..ఇంటికి బయల్దేరాడు..ఇంటి బయటే నాన్న ఎదురుపడ్డాడు..
నాన్న: ఏరా రిజల్ట్స్ చూసావా..
మనోడు: ఆ చూసాను...
నాన్న: రాంక్ ఎంత వచ్చింది..
మనోడు: 15331
నాన్న: (కాసేపు ఆగి..స్కూటరు స్టార్ట్ చేసి) సత్తయ్య కూతురు దీప కి 1500 వచ్చింది అంట.. అని బయల్దేరి వెళ్ళిపోయాడు...మనోడికి కాసేపు నోటి మాట రాలేదు.."ఛ...దీనికి ఎప్పుడు చదువు గొలే...1500 అంటా"...అని దాన్ని తిట్టుకుంటూ వెళ్ళిపొయాడు..
కొన్ని రోజుల తరువాత వినాయక చతుర్ది వచ్చింది...మనోడి గాంగ్ కలిసి "గణపతి" విగ్రహం పెట్టారు వీధిలో..ప్రతి రోజు పూజలు..ప్రసాదం పంచడం లాంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం లో నిమగ్నమైపోయాడు మనోడు...
అలా ఓ రోజు ప్రసాదం పంచే లైను కంట్రోలు చేస్తున్న మనోడికి దీప కనిపించింది...దాన్ని చూసి అక్కణ్ణించి తప్పుకునేంతలో అదే చూసి పిలిచింది...తప్పక వెళ్ళాడు...
దీప: హాయ్ చంటి..ఎలా ఉన్నావ్..
మనోడు: ఆ ఉన్నాను..బానే...
దీప: ఏంటి చాలా హడావిడి అనుకుంటా...
మనోడు: ఏదొ లే...ప్రతి సంవత్సరం ఉండేదేగా..
దీప: తిను నా స్నేహితురాలు...."సిరి"...
చటుక్కున తల ఎత్తి చూసాడు మనోడు..."సిరి" ఎదురుగా..."హాయ్" అని పలుకరించింది...అంతే మనోడికి గుండెలో దడ...ఏమి మాట్లాడాలో...ఎమి చెయ్యలో తెలీట్లేదు...ఇన్ని రోజుల నించి కనిపించని సిరి అకస్మాత్తుగా ఎదురుపడి "హాయ్" అనగానే ఎక్కడికో వెళ్ళిపొయాడు మనోడు...తిరిగి "హాయ్" చెప్పగలిగాడే కాని మళ్ళి మాట్లాడలేక పోయాడు.....అలా చూస్తుండగానే సిరి వెళ్ళిపొయింది...
అప్పుడు చూడడం అఖరు మళ్ళి కనిపించలేదు..కొన్నాళ్ళకి మాటల్లో దీప చెప్పగా తెలిసింది ఆ అమ్మాయికి ఎంసెట్ లో 500 రాంక్ వచ్చింది అని...బిట్స్ లో సీట్ వచ్చి అక్కడికి వెళ్ళిపోయింది అని...
అది మనోడి మొదటి ప్రేమ కథ....మనోడికి చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ "సిరి" కనిపించింది అనుకోండి..అయినా మనోడి టాలెంటులో ఎమీ మార్పు లేదు...చూడడం తప్ప మాట్లాడే ధైర్యం లేదు గా మరి...

Friday, July 20, 2007

ఆంధ్ర మాత!!!

నెల రోజుల తరువాత ఇంటి నించి తెచ్చిన సామాను సర్దాలని గుర్తొచ్చి పెట్టె తెరిచి చూసాను. వెతుకుతుండగా కనిపించింది పచ్చడి తళుకు సంచి. సదరడం అయ్యాక వంట పూర్తిచేసి సంచి లోంచి కొంచం పచ్చడి తీసి పోపు పెట్టాను. భోజనానికి కూర్చుని వేడి వేడి అన్నంలొ పచ్చడి ముద్ద కలిపి తిన్నాను....గోంగూర....హ...భోజనం చేస్తున్న తృప్తి మొదటి ముద్దలొనే కలిగింది...
ఇక అంతే...ప్రతి రోజు గోంగూర పచ్చడి...వేడి వేడి అన్నం....కుమ్మటమే...
గోంగూరని ఆంధ్ర మాత అని మా అమ్మ అంటుంటే ఎంటొ అనుకున్నాను...అవును నిజమే మరి..ముద్ద నోట్లొ పడగానే ఇంటిని అమ్మని గ్నప్తికి తెస్తోన్న గోంగూర నిజంగా 'ఆంధ్ర మాతే' మరి...